మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరా మహిళాశక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ టౌన్, జూన్ 21 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. ఆదివారం 56వ డివిజన్ ఎస్వీఎస్ కాలనీలోని నూతన రోడ్లు, నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. అనంతరం డివిజన్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రె స్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావే శంలో మహిళా సంఘాల సభ్యులకు ఇంది రా మహిళ శక్తి చీరలు పంపిణీ చేశారు.
అం తకుముందు ఎస్వీఎస్ కాలనీలోని నూతన రోడ్లు, నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పథ కం అమలులో మహిళలకు అధిక ప్రాధా న్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రాబో యే ఐదేళ్లలో దాదాపు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా,వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించబడిందన్నారు.
వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్ప ష్టం చేశారు. అనంతరం భీమారం 55వ డివిజన్లో కాకతీయ నగర్ లో 90 లక్షలు చాణక్యపురి కాలనీలో 19.80 లక్షల నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు.
అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిహెచ్ సుందర చార్యు లు, ప్రధాన కార్యదర్శి చల్ల రాజిరెడ్డి, అందా ల తిరుపతిరెడ్డి, రాంబాబు, చాణక్య నగర్ కాలనీ అధ్యక్షులు హనుమ రెడ్డి, కార్యదర్శి విజయ్, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ కందుకూరి పూర్ణచందర్, డివిజన్ మహిళ అధ్యక్షురాలు అనిత, సీనియర్ నాయకులు మర్రి ప్రభాకర్, మెప్మా అధికారి వెంకట్ రెడ్డి, కే.ఆర్ కృష్ణమూర్తి, రాజు, జిల్లా కార్యదర్శి రణధీర్ తదితరులు పాల్గొన్నారు.






