16 April, 2026 | 11:53 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బీఆర్ఎస్ యత్నం

25-04-2025 06:23 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి...

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీనీ బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తేవడానికి బీఆర్ఎస్ యత్నిస్తోందని మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారథి(District CPI Secretary Vijayasarathi) ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ రూపాయి కారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.

అయితే ఇరు పార్టీల ఆశలు రాష్ట్రంలో నెరవేరే పరిస్థితి లేదన్నారు. జూలై 5, 6న కురవి మండల కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పహల్గామ్ లో ఉగ్ర దాడిని నిరసిస్తూ అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

ఆత్మ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డికి ఘన సన్మానం

ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమితులైన జిల్లా సిపిఐ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. రైతు సంక్షేమ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి అజయ్ సారథి, కట్టెబోయిన శ్రీనివాస్ పెరుగు కుమార్ పేషణ పల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న మామిండ్ల సాంబలక్ష్మి వరిపల్లి వెంకన్న పాండురంగాచారి తప్పని శేఖర్ నాగేశ్వరరావు వెంకన్న శ్రావణ్ లింగ్యా నాయక్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.