26-04-2025 12:05:33 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి
మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): రాష్ట్రంలో బీజేపీ నీ బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తేవడానికి బీఆర్‌ఎస్ యత్నిస్తోందని మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారథి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీ జే పీ, బీ ఆర్ ఎస్ రూపాయి కారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
అయితే ఇరు పార్టీల ఆశలు రాష్ట్రంలో నెరవేరే పరిస్థితి లేదన్నారు. జూలై 5 6న కురవి మండల కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పహల్గామ్ లో ఉగ్ర దాడిని నిరసిస్తూ అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
ఆత్మ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి కి ఘన సన్మానం
ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమితులైన జిల్లా సిపిఐ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. రైతు సంక్షేమ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి అజయ్ సారథి, కట్టెబోయిన శ్రీనివాస్ పెరుగు కుమార్ పేషణ పల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న మామిండ్ల సాంబలక్ష్మి వరిపల్లి వెంకన్న పాండురంగాచారి తప్పని శేఖర్ నాగేశ్వరరావు వెంకన్న శ్రావణ్ లింగ్యా నాయక్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.