calender_icon.png 8 November, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ముమ్మర ప్రచారం

08-11-2025 01:07:10 AM

-పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు అడుగడుగునా జేజేలు 

-పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రచార పర్వం ఉధృతంగా సాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తనదైన శైలిలో డివిజన్లలో సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతు న్నారు. ఇందులో భాగంగా, రహమత్ నగర్ డివిజన్‌లోని కార్మిక నగర్‌లో ఆమె నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది.

సునీతకు మద్దతుగా పలువురు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యేలు విజయుడు, కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ లక్ష్మీకాంతరావు వంటి ప్రముఖులు సునీతతో కలిసి అడుగులో అడుగేశారు.అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ చంద్రా వతి,  పద్మాదేవేందర్ రెడ్డి,భుక్యా జాన్సన్ నాయక్, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్ నేత నివేదిత సాయన్న, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయిషా వంటి మహిళా నేతలు పెద్ద సంఖ్య లో పాల్గొని, ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా, నేతలందరూ కలిసి కార్మిక నగర్‌లోని ప్రతి గడపకూ వెళ్లి, బీఆర్‌ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సునీత గోపినాథ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.