calender_icon.png 5 February, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి

05-02-2026 12:59:39 AM

* మున్సిపల్ ఎన్నికలు సీఎంకు గుణపాఠం కావాలి

* మాజీ మంత్రి హరీష్‌రావు

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 4: గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు 10వ వార్డు లక్ష్మగౌని మహేందర్ గౌడ్, 11వ వార్డు జలగరి మల్లేష్, 12వ వార్డు ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్, 13వ వార్డు కుత్తడి నవీన్ లకు మద్దతుగా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చకుండా చేస్తున్న దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసి కష్టపడి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకీ సరైన బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి, పటాన్ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.