7 July, 2026 | 2:01 AM

ఎంపీ, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల భేటీ

07-07-2026 01:24 AM

కేసముద్రం, జూలై 6 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు.

కేసముద్రం మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్లుగా విజయం సాధించిన ఆగే రాము, పాయిరాల శరత్, రావుల వినయ్ రెడ్డి, దూడపాక కృష్ణలతో పాటు పార్టీ నాయకులు జాటోత్ హరీష్ నాయక్, పురం రాజమణి, మేకల సురేష్, బానోత్ దేవేందర్, కన్నెబోయిన శ్రీను తదితరులు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ తో సమావేశమై ఇష్టాగోష్టి జరిపారు. తమ వార్డుల్లో అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్సీ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.