డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు
కేసముద్రం, జూలై 6 (విజయక్రాంతి): కేసముద్రం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే సెంటర్లో భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి అధ్యక్షత వహించగా, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు అమూల్యమైనవని, కశ్మీర్ సంపూర్ణ విలీనం కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగిశెట్టి నాగయ్య, లేంకలపల్లి శ్రీనివాస్, బచ్చు లక్ష్మీనారాయణ, గాంధీ వెంకట్ రెడ్డి, ఐత సారయ్య, ముదిరెడ్డి మురళి, పరకాల మురళి, మహమ్మద్ ఖాసిం, బానోత్ రాము, వాంకుడోత్ నరేష్, ముడావత్ అశోక్, సుధాకర్, పెరమండ్ల నవీన్, చిట్టోజు చక్రధర్ పాల్గొన్నారు.






