27 April, 2026 | 8:26 PM

మోతెలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 06:46 PM

మోతె,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మోతె మండల కేంద్రంలో బి ఆర్ ఎస్  పార్టీ కార్యాలయంలో సోమవారం  బి ఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు ఆధ్వర్యంలో  పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను శీలం సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు మాట్లాడుతూ  పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు.