30 June, 2026 | 2:19 AM

ప్రీప్రైమరీ స్కూల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత

30-06-2026 01:26 AM

కొల్చారం, జూన్ 29: కొల్చారం మండలంలో నూతనంగా మంజూరైన ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి, పోతంశెట్టిపల్లి, రాంపూర్, రంగంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన పాఠశాలలను పరిశీలించి, విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గౌరవిశంకర్ గుప్తా, ఎంపీడీవో,ఎంఈఓ ఉమా రాణి. కోనాపూర్ సంతోష్ రావు. మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి. తుకాపూర్ సర్పంచ్ ఆంజనేయులు. ఉప సర్పంచ్ ఆరే రె రవీందర్. మాజీ సర్పంచ్ రాజా గౌడ్. అప్పాజీపల్లి సర్పంచ్ గజిని వెంకట్ గౌడ్.  ఎండుగుల కృష్ణ. దుర్గాప్రసాద్ గౌడ్. సోమ నరసింహులు. రాజా గౌడ్. శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.