17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కురుక్షేత్రం.. జగిత్యాల రాజకీయం!

07-02-2026 12:58 AM
  1. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రస్తుత ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు 

మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఎవరు పట్టు నిలుపుకొంటారో ? 

జగిత్యాల, ఫిబ్రవరి 6 ( విజయక్రాంతి): జగిత్యాల జిల్లా లోని జగిత్యాల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ పోరు కురుక్షేత్రయుద్దాన్ని తలపిస్తుంది. కరడుగట్టిన కాం గ్రెస్ వాది మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్న ప్రస్తుత బి ఆర్ ఎస్ ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్ మరో వైపు ఇద్దరి మధ్య ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌ఆధిపత్య పోరులా మారింది.

ఇప్పటికి బి ఆర్ ఎస్ లోనే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నా అని చెప్తూనే తన వర్గం నాయకులకు కాంగ్రెస్ టికెట్లు ఇప్పించుకొని ముమ్మరంగా ప్రతి వార్డు లో కార్నర్ మీటింగ్ లు పెడుతూ ప్రచారాన్ని ఒరేత్తిస్తున్నారు.జగిత్యాల అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమని యావర్రోడ్డు విస్తరణ మొదటి ప్రాధాన్యమని చెపుతున్నారు.

మరో వైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత 10 సంవత్సరాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసకు ఓర్చి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించలేదని చేతి గుర్తును దొంగలు ఎత్తుకుపోయారని నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ఓటు వేయాలని ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచిన తన వర్గం నాయకుల తరుపున ప్రచారం చేస్తూ నా గొంతు కూతున్నారని అందులో భాగంగా మొదటగా నా భుజాలను నరుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తన వర్గం నాయకులను గెలిపించుకుని తీరుతానని వార్డులో ముమ్మ రంగా ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఆధిపత్యం సాధించిన ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్ మున్సిపల్ పీఠం దక్కించుకునే ప్రయత్నం లో విజయం సాధిస్తారా లేక మాజీ మంత్రి తన వర్గం నాయ కుల్ని గెలిపించుకొని పట్టు నిలుపుకుంటాడా వేచి చూడాలి.