calender_icon.png 6 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ కు పేగు బంధం..!

15-04-2025 04:21:16 PM

ఆశ చూపి మోసం చేసింది కాంగ్రెస్..

కార్యకర్తలకు అండదండగా ఉంటా..

ఈ నెల 27 రజితోత్సవ సభకు భారీగా తరలిరండి..

వైరా (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు కెసిఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీతో పేగు బంధం ఉందని, దాన్ని ఎవరూ విడదీయలేరని బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ పేర్కొన్నారు. వైరా లోని శ్రీనికేతన్ పాఠశాలలో మంగళవారం ఈనెల 27 తేదీ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే రజితోత్సవ బహిరంగ సభకు సంబంధించి ముఖ్య నాయకులు కార్యకర్తలు సమీక్ష సమావేశం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ఓటమిని పీడకలగా మర్చిపోండని కార్యకర్తలకు సూచించారు. ప్రజలు ఆశాజీవులని ప్రజలకు ఆశ చూపి తీర్చకుండా మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసింది అన్నారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా వారు తెలిపారు. భూమ్మీద ఎవ్వరు శాశ్వతం కాదని నీతివంతమైన పరిపాలన అందించే నాయకుడు మనకు అండగా ఉన్నాడని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. స్వార్థపరులు అవకాశాలను బట్టి పార్టీలు మారినా నిజాయితీగల కార్యకర్తలు నాయకులు పార్టీకి అండగా ఉన్నారన్నారు. జరిగిపోయిన నష్టం గూర్చి ఆలోచించొద్దని, గుడ్డి నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఎన్నో అవమానాలు త్యాగాలు 67 రకాల పోరాటాల ఫలితంగా ఢిల్లీ పెద్దల మెడలో వంచి తెలంగాణ అని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన పిలుపుమేరకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరత ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పాలన, కెసిఆర్ సుపరిపాలన గూర్చి నేటికీ ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందన్నారు. రక్తం బొట్టు కూడా ఉద్యమకాలంలో చింది నేల మీద పడకుండా ప్రజా ఉద్యమాన్ని ప్రజాస్వామ్యతంగా నడిపిన మహానుభావుడు కేసీఆర్ అని అభివృద్ధి సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన గొప్ప నాయకుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ మండల కమిటీ నియామకాలు అదేవిధంగా పార్టీ సభ్యత్వాలు త్వరలో చేపట్ట నున్నట్లు సందర్భంగా వెల్లడించారు ఈనెల 27వ తేదీ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరగబోయే రజితోత్సవ మహాసభకు ప్రణాళిక బద్ధంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు మద్దెల రవి కట్టా కృష్ణార్జున రావు ముళ్లపాటి సీతారాములు వనమా విశ్వేశ్వరరావు డాక్టర్ కాపా మురళీకృష్ణ మాదినేని సునీత బానోతు సక్కుబాయి సామినేని శ్రీనివాస్ రావు అయినాల కనకరత్నం మాదినేని ప్రసాద్ అప్పం సురేష్ నందిగామ మనోహర్ మోటపోతుల సురేష్ ఆదూరి ప్రేమ్ కుమార్ సామినేని శ్రీనివాసరావు బోసు దొంతుబోయిన వెంకటేశ్వరరావు ఏదునూరి శ్రీను యండ్రాతి గోపాలరావు తన్నీరు నాగేశ్వరావు, మాదినేని సత్యనారాయణ,మాదినేని లక్ష్మణ్,బుచ్చి రామారావు కొమరినేని వెంకటేశ్వరరావు బట్ట పెద్ద భద్రయ్య భాస్కర రావు మేదరమెట్ల రాము వల్లభి శ్రీను దొంతుపోయిన వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.