21-08-2025 04:23:26 PM
గుండాల (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో సాంఘిక శాస్త్ర బోధకురాలుగా విధులు నిర్వహిస్తున్న ఈ హేమలత మంగళవారం ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్(ISRO Chairman Dr. Narayanan) చేతుల మీదుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ రేట్ డిగ్రీ పట్టా పొందారు. మిత్రులు, బంధువులు, తన తోటి ఉపాధ్యాయులు, శాలువాతో అభినందించి మరిన్ని మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు.