calender_icon.png 30 July, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరు నిల్వ‘కుంట’

30-07-2025 12:39:16 AM

  1. కుంట కట్టను ధ్వంసం చేసిన దుండగులు

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం

ఊరకుంటపై కన్నేసిన కబ్జా రాయుళ్ళు

అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు

నాగర్ కర్నూల్ జూలై 28 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని ఉయ్యాలవాడ ఊరకుంటపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం గా మారిన అనంతరం భూముల ధరలు అ మాంతం పెరిగాయి. దీంతో ప్రభుత్వ భూ ములు, చెరువులు, కుంటల శిఖం భూములపై రియల్ వ్యాపారులు తమ వశం చేసు కుంరున్నారు. ఇప్పటికే గత పదేళ్లు అధికార బలంతో బిఆర్‌ఎస్ నేతలు ఎక్కడ పడితే అక్కడ అమాంతం భూములను మింగేసా రు.

దీంతో కొన్ని ప్రభుత్వ నూతన భవనాల నిర్మాణం కోసం భూములు లేకుండా పో యాయి. ప్రస్తుతం బిఆర్‌ఎస్ నేతలతోపాటు అధికార కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వ భూములు, కుంటలను కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉయ్యాలవాడ గ్రామ శివారులోనే ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనం ప్రారంభంతో పాటు ప్రభు త్వ మెడికల్ ఆసుపత్రి కూడా ఏర్పాటుకు మంజూరీ కావడంతో ఆ ప్రాంతంలో భూ ముల ధరలకు మరింత రెక్కలోచ్చాయి.

ప్ర ధాన రహదారికి అనుకుని ఉన్న ఉయ్యాలవాడ ఊరకుంటపై కన్నీసి పరిసరా ల్లోని రైతుల పొలాలను కొనుగోలు చేసిన కబ్జారాయుళ్ళు మెల్లిమెల్లిగా కుంటను కబ్జా పెట్టేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఉయ్యాలవాడ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 170లో సు మారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఊరకుంట ఉంది. దీని పరిసరాల్లోని రైతుల పొలాలను కొనుగోలు చేసిన కబ్జారాయుళ్ళు ఆ ప్రాం తంలో వెంచర్లుగా మార్చి వర్షపు నీరు నిల్వలేని చోటు తమదేనని అత్యధిక ధరలకు అ మ్ము కొని సొమ్ము చేసుకుంటున్నారు.

వర్షపు నీరు చేరకుం డా కుంట కట్టను రాత్రి సమయంలో ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉ న్నాయి. కుంటలోనే టి, టిఫిన్ క్యాంటీన్ ఏర్పాటు చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమం గా వాటిలో నిర్మాణాలకు సైతం అధికారుల నుండి అనుమతులు తీసుకుంటున్నారు. కుంటకట్ట ధ్వంసం చేశారని గ్రామస్తులు ఫి ర్యాదు చేయగా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కానీ పోలీస్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక మవుతున్నాయి. కబ్జారాయుళ్లంతా అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల అనుచరులే కావడంతో భారీ ఎత్తున అధికారుల కు ముడుపులు ముట్టజెప్పినట్లు సర్వత్రా వి మర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది ధ్వంసమైన కుంట కట్ట నేటికీ పునర్నిర్మాణం కాకపోవడంతో ఈ అనుమానాలు నిజం చేపడుతున్నాయి.

కనీసం తాత్కాలిక మరమ్మత్తు చేపట్టి నీరు నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం ఏడాది కాలంగా అటువైపు కన్నెత్తి చూ డకపోవడంతో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపద్యంలో ఉన్నతాధికా రులు సైతం పట్టించుకోకపోవడం పట్ల సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భావితరాలకు ఉపయోగపడే పుంటలు జిల్లా కేం ద్రంలోని ఉండడంతో వాటిని క్రమంగా క బ్జా చేసి కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శలు ఉన్నాయి.

కుంట కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం కుంట కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఫిర్యాదు చేసాం. పునరనిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపాం. 

 గౌతమ్ రెడ్డి, ఏఈ, నీటిపారుదల శాఖ, నాగర్‌కర్నూల్