26-07-2025 11:45:36 PM
కాంగ్రెస్ నాయకులు రాజేష్ కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Gaddam Vivek Venkatswamy) పీఏ రమణరావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు అర్థరహితం అని అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు, దళిత రత్న తుంగపిండి రాజేష్ కుమార్ హితవు పలికారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
మంత్రి పీఏ పై బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్ని పక్క దారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పీఏ రమణరావు తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, ప్రజలకు సేవ చేయడంలో మంత్రి వివేక్ చూపుతున్న నిబద్ధతను వ్యతిరేకించలేక, ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత దూషణలతో దాడికి పాల్పడుతున్నారనీ విరుచుకుపడ్డారు. మంత్రి పీఏ పై దుష్ప్రచారం చేయడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, దుష్ప్రచారానికి తగిన మూల్యం ప్రజా క్షేత్రంలో చేలించుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.