16-07-2025 04:42:05 PM
రాజకీయ దురుద్దేశంతో రేవంత్ రెడ్డి మాటలు
కేసీఆర్ హయంలో 6.47 లక్షల రేషన్ కార్డులు పంపిణీ
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): తుంగతుర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతో మాట్లాడారని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పనికిమాలిన మాటలతో అధికారంలోకి వచ్చారని సీఎం అయినా ఇంకా భాష మారకపోవడం దారుణం అన్నారు.
కెసిఆర్,కేటీఆర్,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లపై అవాకులు చావకులు మాట్లాడడం తగదని హెచ్చరించారు.సీఎం వస్తుండు అంటే ఎదో అభివృద్ధి పథకలు వస్తాయని ప్రజలు భావిస్తారు,కానీ వ్యక్తి గత ఆరోపణలతో సీఎం స్థాయి దిగజారి మాట్లాడారని పేర్కొన్నారు.రేషన్ కార్డ్స్ ప్రక్రియ నిరంతరం గా జరిగేదేనని చెప్పారు.
ప్రభుత్వ సొమ్ముతో ప్రజలను,మహిళ సంఘాల మహిళ్లను బలవంతంగా సభకు తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణలో పది సంవత్సరాల కాలంలో బిఆరెస్ 6.47 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు.కామారెడ్డి లో బిసి డిక్లరేషన్ మీద ఎన్నో మాటలు చెప్పారు.19 నెలల్లో బీసీల కోసం ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ నూ ఎందుకు బయటపెట్టలేదని విమర్శించారు.మీ చీకటి ఒప్పందాల కోసం మోడీని కలుస్తారు కాని బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు అడగడం లేదన్నారు.కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి ల ఓట్ల కోసమే ఆర్డినేన్స్ డ్రామా అని అన్నారు.
మోడీని ఒప్పించి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత సీఎం దే అన్నారు.ఎస్ ఎల్ బి సి టన్నెల్ నూ అవగాహన లేకుండా మొదలు పెట్టి కార్మికుల బలిగోన్నారని తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యేకంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సభ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు.కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తెచ్చి పారించిన ఘనత కెసిఆర్ దే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయం అన్నారు.
ఆరు,ఏడు ఫీట్ల పొడవున్న మీ కాంగ్రెస్ నేతలు జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధి కీ కృషి చేసారనీ,మూడు మెడికల్ కాలేజీలు,సాగర్ చివరి భూములకు సాగు నీళ్లు,దర్మల్ పవర్ ప్రాజెక్టులు వేల కోట్ల అభివృద్ధి పనులు తెచ్చారని పేర్కొన్నారు.