16-07-2025 02:57:42 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గోకారం గ్రామం పరిధిలో గల చింతపువ్వు బండ వద్ద కొలువైన అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో(Sri Seetha Ramachandra Swamy Temple) బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను తెలుసుకొని మాట్లాడుతూ దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.