16-07-2025 04:44:52 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): షాట్ సర్క్యూట్ తో సూర్య ఎంటర్ ప్రైజెస్ (ఆలు చిప్స్) గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి పాపిరెడ్డి నగర్ లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్య ఎంటర్ ప్రైజెస్ (ఆలు చిప్స్) గోదాములో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి.
నివాస ప్రాంతంలో గోదాం ఉండడం, గోదాంలో ప్లాస్టిక్, ఫైబర్ ఇతర మండే పదార్థాలు ఉండడంతో తో కాలనీలోని దట్టమైన పొగలు అలుముకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.