calender_icon.png 9 October, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలి

09-10-2025 12:23:41 PM

హైదరాబాద్: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "చలో బస్ భవన్"(Chalo Bus Bhavan) కార్యక్రమం నిర్వహించారు. రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), బీఆర్ఎస్ నాయకులు బస్ భవన్(Bus Bhavan)కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం బస్ భవన్ లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డికి( RTC MD Nagi Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, బండారు లక్ష్మా రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, దేశపతి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 1353 కోట్లు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) తెలిపారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. రూ. 9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను (TGSRTC కింద) విడుదల చేసినట్టు నేతలు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా చేసి, ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తోందని నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ తన నిరసన ర్యాలీ 'చలో బస్ భవన్'ను గురువారం నిర్వహించడంతో సికింద్రాబాద్‌లోని ఆర్‌టీసీ 'ఎక్స్' రోడ్లు, పరిసరాలతో సహా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు మోహరింపు ఉన్నప్పటికీ, కేటీఆర్, టి. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావు గౌడ్ సహా బీఆర్ఎస్ నాయకులు బస్ భవన్ ప్రాంగణానికి చేరుకున్నారు.