calender_icon.png 9 October, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్థాపంతో సీఆర్పీఎఫ్ జవాను బలవన్మరణం

09-10-2025 12:06:45 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): మనస్థాపంతో సిఆర్పిఎఫ్ జవాన్(SEPF jawan) బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా(Karimnagar district) హుజురాబాద్ మండలంలో నీ కాట్రపల్లి  గ్రామంలో  చోటుచేసుకుంది. తల్లిదండ్రులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెరమండ్ల రాజ్ కుమార్ (38) జార్ఖండ్ లో సిఆర్పిఎఫ్ లో జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దసరా సెలవుల కోసమని కాట్రపల్లి గ్రామానికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తన చావును తన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు తెలియజేయాలని సూసైడ్ నోట్లో రాజకుమార్ పేర్కొన్నారు. అలాగే తన చావుకు ఎవరు కారణం కారని, తన తల్లిదండ్రులను కూతురిని బాగా చూసుకోవాలని సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రాజ్ కుమార్ రెండు రోజుల నుంచి మూడీగా, డిప్రెషన్లు ఉంటున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. రాజ్ కుమార్ కు భార్య రెండేళ్ల కుమార్తె ఉంది. రాజ్ కుమార్ మరణంతో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి . తండ్రి బిక్షపతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.