13-12-2025 12:54:10 AM
మేడ్చల్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): షామీర్పేటలోని జ్యోతిబాపూ లే గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్ళిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు అన్నంలో రాళ్లు పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బిఆర్‌ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డి సి ఎం ఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, విద్యార్థి నాయకులు యశ్వంత్ గుప్తా,
ప్రశాంత గౌడ్, విశాల్, క్రాంతి, నితీష్, చంద్రకాంత్ తదితరులు గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లారు. అదే సమయంలో బీసీ గురుకుల సొసైటీ జాయింట్ సెక్రెటరీ మద్దిలేటి, షామీర్పేట్ పోలీసులు వచ్చారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరగా మద్దిలేటి పట్టించులేదని బీ ఆర్‌ఎస్ వి నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.