calender_icon.png 13 December, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి

13-12-2025 12:55:39 AM

మేడ్చల్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా అధనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ అధ్యక్షులు కట్టెల మల్లేశం, కార్యదర్శి గడ్డమీది అశోక్ లు మాట్లాడుతూ  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు.  విద్యాశాఖ అధికారులు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య అందించాలని తెలిపారు. 

జిల్లాల్లో మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ గుప్తా, టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు నోములూరి శ్రీనివాస్ రెడ్డి, కావలి మోహన్, సహాయ కార్యదర్శి పి.శంకర్, చిన్న బాబు, రఫి ఉద్దీన్ ఖాద్రి, ఎస్ ఆర్ కె న్యూస్ ఛానల్ చైర్మన్, రమేష్, కొండల్ రెడ్డి, పర్వీజ్ అహ్మద్, డి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.