13-12-2025 12:53:42 AM
బీఆర్‌ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పుతా
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : తన జోలికి వస్తే బీఆర్‌ఎస్ నేత ల అవినీతి చిట్టా విప్పుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. నేను మంచిదాన్ని కాదు. కాళ్లు విరగొడతాను’ అంటూ ఘాటుగా స్పందించారు. ఇకపై తాను సైలెంట్‌గా ఉండేది లేదని స్పష్టంచేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తానంటూ కవి త ఘాటుగా స్పందించారు. హిల్ట్ పాలసీకి బీఆర్‌ఎస్ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ ద్వారాలు తెరుస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. దేవుడి దయతో తాను ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాన ని.. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తానని కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతల కు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలూ.. జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కేసీఆర్‌తో పాటు ఎవరినైనా ఒక్క పనైనా అడిగామా.. దమ్ముంటే నా ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. తనకు ఎవరితోనూ ఎలాంటి అవగాహన లేదు.. వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన ఆరోపణలపై కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావుతో హరీశ్, బీఆర్‌ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. వా రికి నోటీసులు పంపుతానని, వారంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని హెచ్చ రించారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన టీ న్యూస్ ఏమైనా సోషల్ మీడియా అనుకున్నారా? లేక శాటిలైట్ ఛానెల్ అనుకున్నారా? అని ఆ ఛానెల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో పణలు చేస్తే.. చెక్ చేసుకోవాలా, లేదా? అంటూ ఆ మీడియాను నిలదీశారు.
చెరువునే మింగేశారు..
ఏవీరెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భూ లావాదేవీలు ఉన్నాయని, శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం కేటీఆర్ వద్ద ఉంటారని, ఆయన ఎవరి బినామీనో చెప్పాలని ప్రశ్నించారు. మాధవరం కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి అని, ఓ గుంట నక్క ఆయన వెనక ఉండి ఆడిస్తోందని ఆరోపించారు. కృష్ణారావు బాధితులు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారని వెల్లడించారు.
ప్రణీత్, ప్రణవ్ కంపెనీల్లో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్ అని, ఆ కంపెనీల విల్లాలన్నీ కబ్జాల్లో కట్టినవే అని ఆరోపించారు. వెంచర్ మధ్యలోని 10 ఎకరాల చెరువు ఆ తర్వాత 6 ఎకరాలకు ఎలా తగ్గిందని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా.. ఆ చెరువు సంగతి చూడాలని సూచించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారని ఆరోపించారు.
సీఎం అవుతా.. బీఆర్‌ఎస్‌పై విచారణ చేయిస్తా..
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో నాకు సంబం ధం లేదని, ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్‌కే పరిమితమయ్యానని స్పష్టం చేశారు. తనతో పాటు తన భర్తపై బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని.. అసలు కథ ముం దుంది అంటూ హెచ్చరించారు. పార్టీ నుంచి వెళ్లగొట్టారు కదా.. ఇంకా కళ్ళు చల్లబడలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలను అడ్డం పెట్టుకుని తాము దోచుకోలేదన్నారు. గత పదేళ్లలో ఎప్పుడైనా సాయం కోసం తన భర్త మీ వద్దకు వచ్చారా? అని బీఆర్‌ఎస్ నేతలను కవిత సూటిగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి.. వాటిని తనపై వేయాలను కోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
తాను ఏ తప్పూ చేయలేదని.. బీఆర్‌ఎస్‌లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి సంపాదించలేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చాలా తప్పిదాలు జరిగాయని.. అవి తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ వాళ్ళు తప్పు చేశారనే.. రేవంత్ అధికారంలోకి వచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన లావాదేవీలకు, కాంగ్రెస్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. హరీశ్‌రావు.. విజ్ఞత అని తప్పించుకుంటున్నారని.. ‘లైన్‌లు నేను దాట లేదు. నేను ఇంకా ఊరుకోను ’ అంటూ కవిత హెచ్చరించారు.
ప్రజల సొమ్మును పందికొక్కుల్లా తిన్నారు..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తన భర్త అనిల్ పేరు ఎన్నడూ ఎవరూ వినపడలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంటి అల్లుడిపై ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో తాను కొట్లాడుతుంటే ఏసీ గదిలో ఉంటూ కేసీఆర్ చాటున ప్రజల సొమ్ము పందికొక్కులా తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరవీరుల కోసం బీఆర్‌ఎస్‌లో ఉండి కొట్లాడలేకపోయానని ప్రజలకు క్షమాపణలు చెప్పానని అన్నారు. తాను బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేయడంలేదని తనను కొడితే ఊరుకోనని అ న్నారు. తప్పులేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చివాగుడు వాగితే ఊరుకునేది లేదన్నారు. తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఐదేళ్లు తనను ఓడగొట్టి ఇం ట్లో కూర్చోబెట్టారని అన్నారు. ఎంపీ టికెట్ అడిగితే ఇవ్వలేదని, ఎమ్మెల్సీని చేసి పక్కన పెట్టారని అన్నారు. తనను ఎవరైనా కలిసేందుకు వచ్చినా వారిని బెదిరించేవారని వెల్లడించారు.