calender_icon.png 16 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య కార్తీక మాస వన భోజనాలు

16-11-2025 05:57:07 PM

పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్..

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తిక మాస వన భోజనాలల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నిర్వాహకులకు శుభాకాంక్ష తెలిపారు. అనంతరం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలయ అర్చకులు వేదో ఆశీర్వచనం అందించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని విప్ వేడుకొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చేపూరి నాగరాజు వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కనపర్తి రాకేష్, కాంగ్రెస్ నాయకులు గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.