16-11-2025 05:55:02 PM
భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్లకు దీపారాధన...
పెద్ద ఎత్తున తరలివచ్చిన బ్రాహ్మణులు....
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వన సమారాధన కార్యక్రమం కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మహిళలు అందరు ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయడం వలన తమ కోరికలు నెరవేరుతున్న విశ్వాసంతో పెద్ద ఎత్తున దీపారాధనలు కుటుంబ సమేతంగా తరలివచ్చిన బ్రాహ్మణులు విష్ణు శివ ఆరాధనతో బ్రాహ్మణోత్తములచే విష్ణు శివులకు అభిషేకం, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలతో, ప్రాంగణం మారుమోగింది.
శ్రీ రంగనాయక స్వామి సమారాధన కార్యక్రమానికి కరీంనగర్ నుండి దాదాపు మూడు వందల మంది బ్రాహ్మణులు తరలి వచ్చి పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని దర్శించడమే కాకుండా ఈ ఆలయానికి వచ్చి పునీతులమైనమని భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తోగుట రంగంపేట పీఠాధితులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి శిష్య బృందం చే భక్తి గీతాలతో ప్రాంగణం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ సభ్యులు అందరు పాల్గొని, వన సమారాధ కార్యక్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది.
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కసుబా భూమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పురం ప్రేమ్ చందర్ రావు, ఉపాధ్యక్షులు జివి రంగారావు, శ్రీ గణేశ శారద శంకరాలయ కమిటీ అధ్యక్షులు, ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శి రామక విట్టల్ శర్మ ట్రెజరర్, మూగు నాగన్న, సంఘ ముఖ్య నాయకులు, నేదునూరి వామన్ రావు, మూగు హరిశంకర్ శర్మ, దన్నాయక్ దామోదర్ రావు, సి ఎ, రామ్మోహన్ బొమ్మెన రాధా కిషన్ రావు, అయాచితుల రాజేశ్వరరావు, సుధాకర్ శర్మ, భాస్కర్ శర్మ, దన్నాయక్ శ్రీనివాసరావు,ఎర్రబాటి శశికాంత్, గంగవరం వెంకటేశ్వర శర్మ భూ శంకర్ శర్మ, గర్రెపల్లి వామన్ శర్మ, కరీంనగర్ చుట్టూ ప్రాంతాల వారే కాకుండా సుల్తానాబాద్ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు..