calender_icon.png 16 November, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాలు, పురుగుమందు వాడకంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి

16-11-2025 05:46:37 PM

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

నకిరేకల్ (విజయక్రాంతి): వ్యవసాయ అధికారులు నారుమడి నిర్వహణపై ఎరువులు పురుగుల మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించి దిగుబడి పెంచేందుకు కృషి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ సీజన్ ప్రారంభంకావడంతో ఇప్పటికే రైతులు నార్లు పోస్తూ కేవలం ఎరువుల దుకాణదారులు ఇచ్చిన విత్తనాలను మాత్రమే వేస్తూ పంట అనంతరం దిగుబడి రాక పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారని అన్నారు. మండల వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు వాడాలో ఏ సమయంలో ఎలాంటి ఎరువులు పురుగుమందులు వాడాలో గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు పెట్టి నాణ్యమైన విత్తనాలను సూచించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న అనేక రకాల ధ్రువీకరణ లేని కంపెనీలు విత్తనాలను అందిస్తూ వాటి మార్కెటింగ్ కోసం డీలర్లు రైతులకు అంటగట్టడంతో నాణ్యమైన పంట రాక దిగుబడి తగ్గుతుందని ఆయన వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 85 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు 25 మంది మండల వ్యవసాయ అధికారులు మాత్రమే ఉన్నారని అయినా ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న 421 గ్రామాలకు ఒక్కొక్కరు నాలుగు గ్రామాల చొప్పున రైతు అవగాహన సదస్సులు నిర్వహించి చలి తీవ్రతను తట్టుకొని నారుమడి ఎలా నిర్వహించాలో నాణ్యమైన విత్తనాలు ఏ కంపెనీవి వాడాలో సూచించాలని అన్నారు.

జింకు రైతులకు సరిపోను ప్రతిపాదనలపై అధికారులకు పెట్టి కొరత లేకుండా అందరికీ సరిపోయేలా సకాలంలో తెప్పించడం కోసం ప్రయత్నం చేయాలని అన్నారు. నూతన సాంకేతికత అనేక పురుగుమందులు వాడిన పెట్టిన పెట్టుబడికి కనీసం దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గన్నెబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం నాయకులు కందుల హనుమతు, కల్లూరి నగేష్,అంబటి సురేందర్ రెడ్డి, పాశం రాంరెడ్డి, ఎండీ రషీద్, బొల్ల వెంకన్న, కొమ్ము అంజయ్య తదితరులు పాల్గొన్నారు.