16-11-2025 05:59:19 PM
నకిరేకల్ (విజయక్రాంతి): భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట రూపకర్త చండ్ర పుల్లారెడ్డి 41 వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన కొన్ని ముఖ్య రచనలను పుస్తకంగా ముద్రించి ఈ నెల 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నట్లు న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మెయిన్ సెంటర్ లో సిపి రెడ్డి సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చండ్ర పుల్లారెడ్డి 41 వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ముఖ్య రచనలను న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తెలుగు, ఇంగ్లీషు అనువాదలతో పుస్తకాలు రూపొందించిందని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ సభకు విప్లవ శ్రేణులు, సిపి అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి, పి. వై.ఎల్ జిల్లా అధ్యక్షులు మామిడోజూ వెంకటేశ్వర్లు, ఏఐకేఎంఎస్ నాయకులు పుట్ట సత్యం, ఐ యఫ్ టీ యూ నాయకులు మామిడి ఎల్లయ్య, బి.యం.ఎస్ కన్వీనర్ చెడిపల్లి కాశీరాం, బీసీపీ జిల్లా నాయకులు బొల్లికొండ లింగయ్య, గుత్తా వెంకటరెడ్డి, గిరి వెంకన్న, మరయ్య, రాములు పాల్గొన్నారు.