28 April, 2026 | 4:29 AM

మేడ్చల్, గుండ్లపోచంపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

28-04-2026 01:34 AM

మేడ్చల్ అర్బన్,ఏప్రిల్ 27(విజయక్రాంతి):సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్, గుండ్లపోచంపల్లిలో బీ ఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ లోని స్వామి వివేకానంద కూడలిలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు  జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆవిర్భవించిన పార్టీ బీఆర్‌ఎస్ పార్టని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిహెచ్‌ఎంసి 297,298 డివిజన్ లకు చెందిన మాజీ కౌన్సిలర్ లు అమరం జైపాల్ రెడ్డి.బేరి బాలరాజు.తుడుం గణేష్ నడికోప్పు నాగరాజు ముదిరాజ్.సోంగారి జనార్దన్ రెడ్డి.మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు అకీటి నవీన్ రెడ్డి.మాజీ సర్పంచులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి.అప్పమ్మగారి జగన్ రెడ్డి.కె రాజు శ్రీనివాస్.ఉప సర్పంచులు.ఎంపీటీసీలు.బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ దయానంద యాదవ్.డాక్టర్ సంజీవ గౌడ్.పార్టీ జిల్లా ముఖ్య నాయకులు.కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నార.