28 April, 2026 | 3:18 AM

బోనస్.. భోంచేశారు!

28-04-2026 01:34 AM

సన్న రకం పేరుతో దొడ్డు ధాన్యం సరఫరా

100 కోట్ల వరకు స్వాహా

  1. గడిచిన నాలుగు సీజన్లలో అక్రమాల తతంగం
  2. నిజామాబాద్ జిల్లా సిరికొండ కేంద్రంగా ధాన్యం దందా
  3. నాలుగు రైస్ మిల్లులపై కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు
  4. నేడో రేపో విచారణకు రంగం సిద్ధం
  5. మిల్లర్లు, సహకార సంఘం అధికారుల కుమ్మక్కు
  6. సన్నరకం ధాన్యం బోనస్‌ను పంచుకున్న అక్రమార్కులు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఒకటి కాదు.. రెండు ఏకంగా 4 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం సరఫరా.. ఒక సారి కాదు.. రెండుసార్లు కాదు.. ఇప్పటికి నాలుగుసార్లు (నాలుగు సీజన్లలో) ఇలా జరిగింది. రూ పాయి.. రెండు రూపాయలు కాదు.. ఒక్కో క్వింటాలుకు రూ.500 చొప్పున వచ్చిన బోనస్ మొత్తం అప్పనంగా భోంచేశారు. ఇలా భోంచేసిన మొత్తం రూ.100 కోట్ల వరకు ఉంటుందని అం చనా. ఇదీ స్థూలంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ కేంద్రంగా సన్నధాన్యం పేరుతో.. దొడ్డురకం సరఫరా చేసి.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇచ్చిన బోనస్ మొత్తాన్ని భోంచేశారు.

ఒది ఏ ఒక్క సీజన్‌కో కాదు.. ఏకంగా నాలుగు సీజన్లలో జరుగుతున్న తతం గం. ఇందుకు సంబంధించిన ఫిర్యాదు కూడా నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు అం దింది. సిరికొండ పరిధిలోని నాలుగు రైస్ మిల్లర్లు, సహకార సంఘం అధికారులు కలి సి దొడ్డురకం ధాన్యాన్న సన్న ధాన్యంగా పేర్కొంటూ.. ప్రభుత్వం నుంచి వచ్చిన బోనస్‌ను వాటాలుగా పంచుకున్న అక్రమంపై రే పో, మాపో విచారణకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

ఆ నాలుగు మిల్లులు..

నిజామాబాద్ జిల్లా సిరికొండ సహకార సంఘం పరిధిలోని మైలారం, చిన్న వాల్గో ట్, కొండూర్, తాళ్ళ రామడుగు, హుసేన్‌నగర్, సిరికొండ కొనుగోలు కేంద్రాల నుంచి ఈ దొడ్డురకం ధాన్యం సేకరించి.. ట్రక్ షీట్ల లో మాత్ర దానిని సన్నరకం ధాన్యంగా చూ పించారు. ఈ దొడ్డు రకం ధాన్యాన్ని నాలు గు రైస్ మిల్లులకు సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో న్యావనంది గ్రా మానికి చెందిన ధనలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్, ధనలక్ష్మి రైస్ మిల్, సిరికొండకు చెం దిన తిరుమల రైస్ మిల్, హుస్సేన్‌నగర్‌కు చెంది న జైగురు రైస్‌మిల్ ఉన్నట్టు కలెక్టర్‌కు అం దిన ఫిర్యాదులోనూ స్పష్టంగా పేర్కొన్నారు.

ఒక్కో మిల్లుకు లక్ష క్వింటాళ్లకు పైనే..

సిరికొండ సహకార సంఘం పరిధిలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన దొడ్డు ధాన్యాన్ని ఈ నాలుగు రైస్ మిల్లు లకు సరఫరా చేసి.. దానిని సన్నరకం ధా న్యంగా చిత్రీకరించారు. ఇలా ఒక్కో సీజన్‌లో ఒక్కో రైస్ మిల్లుకు.. సుమారు లక్ష క్వింటాళ్ల వరకు సరఫరా చేసినట్టుగా అంచనా వేశా రు. రైస్ మిల్ సామర్థ్యాన్ని బట్టి.. అటూ ఇ టూగా సరఫరా చేసినప్పటికీ.. సగటున ఒ క్కో మిల్లుకు లక్ష క్వింటాళ్ల వరకు దొ డ్డురకం ధాన్యాన్ని సరఫరా చేసినట్టు అం చనా వేస్తున్నారు.

ఇలా గత నాలుగు సీజన్లలో (వాన కాలం, యాసంగి) ఇలాంటి అక్రమాలు జరిగినట్టు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ప్రాథమికంగా అధికారులు ఈ అంశంలో 11 మందికి నోటీసులు జారీచేసి చేతులుదులుపుకున్నట్టు ప్రచారం జరుగుత్నుది. అయితే అంతర్గతంగా ఈ అక్రమాలను నిగ్గు తేల్చకుండా పావులు కదుపుతుండటంతో నే రు గా కలెక్టర్‌కే ఫిర్యాదు అందినట్టు తెలుస్తున్నది.

రూ.100 కోట్ల వరకు స్వాహా..

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నది. ఈ తాజా అక్రమంలో గత నాలుగు సీజన్లలోనూ చూసుకుంటే.. దొడ్డు రకాన్ని సన్న ధాన్యంగా చూపి నొక్కేసిన బోనస్ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతుగా విచారిస్తే ఈ అక్రమాల చిట్టా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనికూడా అధికా రులు భావిస్తున్నారు. 

మిల్లర్లు, అధికారుల మిలాఖత్..

నిజానికి సిరికొండ సహకార సంఘం పరిధిలో దొడ్డురకం ధాన్యమే గరిష్ఠంగా పం డుతుంది. ఒకటీఆరా.. సన్న రకం పండించినా.. అది రైతులు, ఇతర వ్యక్తుల అవస రాలమేరకే పండిస్తారని పలువురు రైస్ మిల్లర్లు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే సిరికొండ సహకార సంఘం పరిధిలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచే ఈ అక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేసి.. వాటిని కేవలం నాలుగు మిల్లులకు మాత్ర మే తరలించేవారు.

ఇలా తరలించిన ధాన్యా న్ని సన్నరకంగా ట్రక్‌షీట్లపై రాసి పంపించేవారు. దీంతో అదంతా సన్నరకం ధాన్యంగా రికార్డుల్లో కనపడేలా సహకార సంఘం అధికారులు చక్రం తిప్పారు. దీనికితోడు రైస్ మిల్లర్లు కూడా ఈ అక్రమంలో భాగస్వాములు కావడంతో తమకు వచ్చింది.. సన్న రకం ధాన్యమేనంటూ మిల్లర్లు కూడా రికార్డులను సిద్ధం చేయడంతో ప్రభుత్వం బోన స్‌ను విడుదలచేసింది. ఇలా వచ్చిన బోనస్ సుమారు రూ.100 కోట్ల వరకు అటు మిల్ల ర్లు, ఇటు సహకార సంఘం అధికారులు కలిసి వాటాలు వేసుకుని మరీ మెక్కేశారనే చెప్పవచ్చు.

రైస్ మిల్లర్లు, సహకార సంఘం అధికారులు కలిసి భారీ మొత్తంలో బోనస్‌ను దిగమిండంపై అధికారులకు అందిన ఫిర్యాదుతో నేడో, రేపో విచారణకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రంగం సిద్ధం చేశారని సమాచారం. అయితే ప్రాథమికంగా చేసిన విచారణలో కేవలం 11 మందికి నోటీసులు జారీచేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా కలెక్టర్ దృష్టి సారించినట్టు తె లుస్తున్నది. ఏదేమైనా లోతుగా విచారణ చేస్తే ఇందులో భారీ అక్రమాలు బట్టబయలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.