calender_icon.png 5 October, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

04-10-2025 08:35:14 PM

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసలను ప్రజలకు వివరిస్తాం

బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల అత్యవసర సమావేశం బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు  ఈసమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసలను ప్రజలకు వివరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉన్న బాకీ కార్డులను ఆయన విడుదల చేసారు. కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించిందని చెప్పారు.

అభయహస్తం పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టేందుకు సిద్ధం ఐతుంది.. కరెంటు చార్జీలు కూడా పెంచాబోతున్నారు. రైతులకు యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన పంట కొనుగోలు చేసేందుకు కూడా అవసరమైనా ఏర్పాట్లు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కారణంగా ఎవరికి లాభం కలిగిందో ప్రజలు ఆలోచన చేయాలి.

రానున్న ఏ ఎన్నికలు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ది చెప్పాలి. ప్రతి మహిళకు గృహలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు 55వేల రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధాప్య పింఛన్ ను నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 22 నెలల కాలంలో ప్రతి వృద్ధుడికి 44 వేల రూపాయలు బాకీ పడిందన్నారు. దివంగుల పెన్షన్ ను 6000 కు పెంచుతామన్న ప్రభుత్వం ఇప్పటివరకు 44 వేల రూపాయలు ప్రతి దివ్యాంగుడికి బాకీ పడిందన్నారు.

షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ లక్షలాదిమంది ఆడపడుచులకు బంగారం బాకీ పడిందన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు 76 వేల రూపాయల బాకీ పడిందన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం ప్రతి గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి 88 వేల రూపాయల బాకీ పడిందన్నారు. దీంతోపాటు విద్యార్థులను స్కూటీ, విద్య భరోసా కార్డు కింద 50 వేల రూపాయలు బాకీ పడిందన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులకు ఈ విషయాలపై నిలదీయాలని కోరారు.