calender_icon.png 5 October, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి

04-10-2025 08:35:51 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండలం పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన గంజి రామ్(41) అనే వ్యక్తి పితిరి వాగులో ప్రమాదవశాత్తు పడి ఫిట్స్ రావడంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగరాజ్ తెలిపిన వివరాల ప్రకారం... తాళ్ల సింగారం గ్రామానికి చెందిన ​గంజి రామ్ సూర్యాపేటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 1, 2025 తేదీన తన సొంత గ్రామమైన తాళ్ల సింగారంకు వచ్చాడు. అదే రోజు సాయంత్రం సుమారు 5:00 గంటల సమయంలో పితిరి వాగు వద్దకు మల విసర్జన కోసం వెల్లి ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి, వెంటనే ఫిట్స్ రావడంతో నీటిలో మునిగి మరణించినట్టు తెలిపారు. ​ఈ విషయాన్ని శనివారం ఉదయం సుమారు 8:00 గంటల సమయంలో గ్రామస్తులు గమనించి వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని, ​ఈ ఘటనపై మృతుని సోదరుడు గంజి సుభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  తెలిపారు.