calender_icon.png 4 October, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ, దసరా తిరుగు ప్రయాణరద్దీని పర్యవేక్షించిన కరీంనగర్ జోన్ ఈడీ, ఆర్ఎం

04-10-2025 08:31:38 PM

కరీంనగర్ (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండగల తరువాత కరీంనగర్ బస్ స్టేషన్ నుండి జేబీఎస్, ఇతరగమ్య స్థానాలకు ప్రయాణీకుల తిరుగు ప్రయాణ రద్దీని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు పర్యవేక్షించారు. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని కరీంనగర్ బస్ స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్ మల్లేశంకు సూచించారు. వారి వెంట కరీంనగర్ రీజియన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్ భూపతిరెడ్డి ఉన్నారు.