calender_icon.png 27 September, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం.. పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్

27-09-2025 02:19:47 PM

హైదరాబాద్:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాజీ మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’(Congress Dues Card Movement) పోస్టర్ ను ఆవిష్కరించారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ర్‌ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయని పేర్కొన్నారు.

రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని రాష్ట్ర ప్రజలకు కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao ) పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని తెల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందని కేటీఆర్ వివరించారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన  వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు.