calender_icon.png 27 September, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

27-09-2025 02:02:20 PM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై(BC reservations) మాధవరెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి హౌజ్ మోషన్ పిటిషన్ కు అనుమతి కోరారు. హౌజ్ మోషన్ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ పిటిషనర్ హౌస్ మోషన్ పిటిషన్ రిజిస్ట్రీ అనుమతి కోరారు. 3 రోజుల క్రితమే బీసీ రిజర్వేషన్లపై మాధవ రెడ్డి పిటిషన్ వేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ విచారించలేమని హైకోర్టు(Telangana High Court) పేర్కొంది. నిన్న జీవో విడుదల కావడంతో పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.