calender_icon.png 27 September, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి కంటే చరిత్ర గొప్పది: ఈఈ

27-09-2025 03:10:23 PM

ఆర్మూర్ రూరల్: సృష్టి కంటే చరిత్ర గొప్పదని పురాతన కట్టడాలను రక్షించుకొనే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆర్మూర్ పంచాయతీ రాజ్ కారునిర్వాహక ఇంజనీరింగ్ అధికారి రాజేశ్వర్ అన్నారు. శనివారం రోజు "అల్లకొండ ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి "పుస్తకావిష్కరణ చేస్తూ అన్నారు. "సృష్టిలో ఒక కవి జన్మిస్తే ఆకాశంలో చుక్కలు వెలుస్తాయని - అలాగే గొప్ప నాయకులు మరణిస్తే ఆకాశంలోని చుక్కలు రాలుతాయని" అలాగే సృష్టిలో కవులు రచయితలు ఉన్నంతకాలం కళాకారులు రచించిన చరిత్రలే భావితరాలకు గుర్తుండిపోయే విధంగా నిలిచి పోతాయని అన్నారు. 1059లో అల్లయ్య కొండయ్య మల్ల యోధుల ద్వారా నిర్మితమైన అల్లకొండ సామ్రాజ్యన్ని కాకతీయ గణపతి దేవుల హయాంలో ఖిల్లా రూపంగా నిర్మితమైందని దేశ స్వాతంత్య్రానికి పూర్వము రాజుల పాలనలో ఖిల్లా, దుర్గాలు, కోటలు డంగు చున్నాముతో నిర్మితమై నేడు శితిలావస్తలో ఉన్నాయని, మరికొన్ని సంవత్సరాల్లో ఆనవాళ్లు  లేకుండా  కూలి పోయి ప్రమాదం ఉందని అల్ల కొండలోని పురాతన కట్టడాలను రక్షించుకొనే బాధ్యత అల్లకొండలో జన్మించిన ప్రతి పౌరుడిపై ఉందని ఈ పురాతన కట్టాడాల బావి తరాలకు గుర్తుండి పోయే విదంగా కాపాడుకోవాలని తపన దీన్ని సామజిక ఉద్యమంగ చరిత్ర కారుల వల్లనే సాధ్యం అవు తుందని అయన అభిప్రాయపడ్డారు.

నేను నా బాల్యంలో అల్ల కొండ ఖిల్లాను చూశానని మల్లి పుస్తక రూపంలో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని ఆ నాటి చరిత్రను కళ్ళకు ఆగుపించే విదంగా పుస్తక రూపంలో తీసుక వచ్చిన పుస్తక రచయిత బి. అర్.నర్సింగ్ రావు ని అభినందిస్తూ అల్లకొండ చరిత్రను చదివి ఇంకో పదిమందికి తెలిసేలా చేస్తానని అయన వివరించారు. పూర్వపు కట్టాడాలన్ని "ఏ మతస్థుల సొత్తు కాదు", అన్ని కట్టడాలు భావి తరాలకు గుర్తుండే విధంగా ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. 1780- 1836 కాలంలో మద్రాసు సుప్రీంకోర్టు ప్లీడరు ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా భారత పర్యటన చేస్తూ బాల్కొండ లో 1830 లో జూన్ 26 నుండి 29 వరకు విడిది చేసినట్లు ఆయన వ్రాసుకున్న "కాశీయాత్ర అనుభవాల్లో ఏనుగుల వీరస్వామి వివరించారాని గుర్తి చేసారు. 

అలాగే బాల్కొండ పురాతన ఖిల్లా భూములు అంతరించి పోవడానికి ప్రధాన కారణాలు నాలుగు అని

1).ప్రజలు చరిత్ర తెలుసుకోలేక పోవడం.

2).ప్రజల్లో ఐక్య మత్యం లేక పోవడం.

3).పూర్వ సాంకృతి సంప్రదాయాలు వది లేయడం

4).రాష్ట్ర పర్యాటక శాఖ మరియు కేంద్ర ప్రభుత్వాలు పురాతన కట్టడాల పునః నిర్మాణాలు చేయకపోవడమేనని ఈ నాలుగు కారణాల వల్లనే పూర్వ కట్టడాలు శితిలావస్థలో ఉన్నాయని అయన అవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు మాట్లాడుతు 1059లో ఏర్పడ్డ పూర్వ ఖిల్లా ప్రకృతి సంపదని కొందరు లూటీ చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. బాల్కొండ ఖిల్లాను పర్యటక కేంద్రంగా గుర్తించి మరమ్మతులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి భారతదేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు నర్సింగ్ రావు వివరించారు.