calender_icon.png 27 September, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచ పరివర్తన ద్వారానే దేశ హితం

27-09-2025 03:14:45 PM

హెచ్ జే ఎం.అఖిల భారతీయ సంఘటన మంత్రి దేవేందర్..

హనుమకొండ (విజయకాంతి): సమాజంలో అన్ని వర్గాలవారు కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని హిందూ జాగరణ మంచ్ అఖిల భారతీయ సంఘటన మంత్రి దేవేందర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హసన్ పర్తిలో నిర్వహించిన విజయదశమి కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సమరసత, పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌర నియమాలు అనే ఐదు విషయాలను సమాజంలో ప్రతి పౌరుడు తెలుసుకొని వాటి ఆచరణకు నడుంబించాలన్నారు. వీటి ద్వారా సమాజంలో సమూలమైన మార్పు వస్తుందన్నారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమిగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాపిశెట్టి సాంబయ్య మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల తపస్సు కారణంగా నేడు దేశం ప్రగతి పథంవైపు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ అధ్యక్షులు ప్రొఫెసర్ చిలకమారి సంజీవ, హసన్పర్తి నగర సంఘచాలక్ బండ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.