27-09-2025 03:33:58 PM
జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): దేవీ నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో అవోప ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలలో తంబోలా ఆటకు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ లేనివిధంగా లక్షెట్టిపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఇట్టి ఉత్సవాలలో కులమతాలకతీతంగా అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేవీ నవరాత్రులు ప్రకృతిని పూజించే విధానంగా చూడాలన్నారు.
నవరాత్రులలో బతుకమ్మ ఆట ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పూలను దేవుడిగా కొలవడం తెలంగాణ ప్రత్యేకమన్నారు. అనంతరం యూనిట్ అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ మాట్లాడుతూ... పట్టణంలో ఏడు దేవీ మండపాలు ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, జిల్లా ఆవోప కార్యదర్శి శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి అక్కెనపల్లి రవీందర్, గౌరవ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, సభ్యులు నరేందుల భీమన్న, కొత్త అనిల్, నరేందుల రమేష్, మాదంశెట్టి సతీష్, మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ, నల్మాస్, ధనలక్ష్మి, సాయిని, కవిత, పల్లెర్ల శైలజ, సౌజన్య, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు,పాల్గొన్నారు.