27-09-2025 03:04:35 PM
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్రోద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఏ. ఓ పద్మ, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.