calender_icon.png 27 September, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యత ఉంటే ఎక్కడైనా సముచిత స్థానం

27-09-2025 03:19:18 PM

ఏటీసీలలో కార్పోరేట్ స్థాయి నైపుణ్య శిక్షణ..

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నైపుణ్యత ఉంటే ఎక్కడైనా సముచిత స్థానం లభిస్తుందని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీ సెంటర్ లను ప్రారంభించుకున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65  అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లను  వర్చువల్ గా ప్రారంభించారు. మహబూబ్ నగర్ అడ్వాన్స్ ట్రేనింగ్ సెంటర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది స్కిల్స్ మ్యాన్ పవర్ అవసరముందని, అందుకు తగినంత స్కిల్స్ మ్యాన్ పవర్ ప్రపంచంలో అందుబాటులో లేదన్నారు. టాటా సంస్థ సహాకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లను ఏర్పాటు చేసుకున్నామని, ఈ సెంటర్ ద్వారా  మన యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్లు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ఏటీసీలో చదివిన ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్: ఎమ్మెల్యే 

వచ్చే ఏడాదిలోగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏటీసీ సెంటర్ నందు శిక్షణ పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని స్పష్టం చేశారు.  ఎటిసి సెంటర్ లలో చేరి చదివే విద్యార్థులకు  వచ్చే సంవత్సరం నుంచి రూ 2 వేల స్టైఫండ్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.  బి టెక్ లాంటి ఖర్చుతో కూడుకున్న కోర్సులు కాకుండా ఐటిఐ లాంటి కోర్సులలో చేరి నైపుణ్య శిక్షణ పొందితే టాటా కంపెనీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు ఎటిసి సెంటర్ దగ్గరకే వచ్చి కోర్సు పూర్తి చేయకముందే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గంజి ఆంజనేయులు, రాషెద్ ఖాన్, ఖాజా పాషా  నాయకులు శ్రీనివాస్ యాదవ్, వరద రవి, కాటం రాజు, గోరం హరిష్, బి.శశి, ఎటిసి సెంటర్ ప్రిన్సిపాల్ శాంతయ్య, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.