27-09-2025 02:54:45 PM
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ డిమాండ్.
ముకరంపురా (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్లకు బకాయిలు ఉన్న 4 డీ ఏ లు దసరా కానుకగా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్లు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. డీఏ లైనా ప్రకటించుతే దసరా, బతుకమ్మ పండుగలను సంబరంగా సంబరాలు జరుపుకుంటామని వేచి చూస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలపై నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, జాప్యం చేయకుండా వెంటనే స్పందించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగుల పాత్ర అభినందనీయంగా ఉందని, ఎంతో చిత్తశుద్ధితో విధులను నిర్వహిస్తున్నారని ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని గుర్తించి తగు ప్రయోజనాల్లో కోతలు పెట్టవద్దని తమ గోడుని ప్రభుత్వం వినాలని అన్నారు. వినిమయ ధరల సూచీకీ అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించబడుతున్నా నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జాడ్యం ఎందుకని ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రశ్నిస్తున్నారని అన్నారు.