calender_icon.png 11 October, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన బీఆర్‌ఎస్

11-10-2025 01:46:48 AM

హామీల పేరుతో మోసం : మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్, అక్టోబర్ 10(విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రూపొందించిన బాకీ కార్డును ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురా లు, మాజీ ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో విడుదల చేశారు.

ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హౌస్ అరెస్టులు చేస్తే బిఆర్‌ఎస్ పార్టీ భయపడేది కాదనీ , ఎన్ని అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా తమ పోరాటం ఆపమన్నారు.

కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు.

కాగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులోనీ వివరాలను వివరించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హన్మంతరెడ్డి, లావణ్య రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.