కళ్యాణ మండపం భూమిపై ఫలించిన బీఆర్‌ఎస్ పోరాటం
బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొబ్బల శివశంకర్‌రెడ్డి
చిట్యాల, ఆగస్టు 20: చిట్యాల పట్టణంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం దాతల సహకారంతో కొనుగోలు చేసిన ఎకరం 12 గుంటల భూమి పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన పోరా టం ఫలించిందని ఆ పార్టీ పట్టణ నాయకుడు బొబ్బల శివశంకర్రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేర కు భూమి పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపట్టామని తెలిపారు.
తమ పోరా టం ఫలితంగానే భూమిని పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచే పరిస్థితి ఏర్పడిందన్నారు. అఖిలపక్ష సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎకరం 12 గుంటల భూ మిని యథాతథంగా అప్పగించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. భూమిని తహసీల్దార్, రెవెన్యూ సర్వేయర్, మున్సిపల్ కమిషనర్ సంయుక్తంగా సర్వే చేసి, కబ్జాలకు అవకాశం లేకుండా పరిరక్షించాలని కోరారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని శివశంకర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, 10 వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డ్ కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, సింగల్ విండో డైరెక్టర్ కన్నెబోయిన శ్రీశైలం, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి ,పాల కృష్ణ ,ఆగు అశోక్ యాదవ్ , నలవత్ కృష్ణ, బులుగురు సైదులు, జిట్టా శేఖర్, మద్ది మధు, ఎండీ మజ్జు, బి ఆర్‌ఎస్ పార్టీ తదితులు పాల్గొన్నారు.






