23-09-2025 08:40:46 PM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
బోథ్,(విజయక్రాంతి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయడంఖా మోగియ్యనుందని, దీని కోసం ప్రతీ కార్యకర్త కంకణ బద్ధులై బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం నేరడిగొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్, కార్యదర్శి ఉయిక గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు సంజీవ్, నాయకులు సంతోష్, రవి బీఆర్ఎస్ లో చెరడంతో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరిన వెంకటేష్ మాట్లాడుతూ రానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలోనే బోథ్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు.