calender_icon.png 23 September, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చొరవతో ఉప్పల్ అభివృద్ధికి 2.85 కోట్లు మంజూరు

23-09-2025 08:10:46 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ 2.85 కోట్లు మంజూరు చేశారు  ఉప్పల్ లోని శ్రీనగర్ కృష్ణారెడ్డి నగర్ లోని 550 మీటర్ స్టాంప్ వాటర్ డియిన్  నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. సాయి నగర్ ఆర్చ్ నుండి టిఎఫ్ఐఆర్ వరకు  కృష్ణానగర్ రోడ్ నెంబర్ 1.2 కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అంచనాల రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.