calender_icon.png 23 September, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రతుకు దెరువు కోసం వెళ్తూ.. మృత్యువు ఒడిలోకి ..

23-09-2025 09:18:20 PM

అలంపూర్: పొట్ట చేత పట్టుకుని కుటుంబ పోషణ నిమిత్తం బ్రతుకు దెరువు కోసం ఇతర ప్రాంతానికి బైక్ పై వెళ్తున్న భార్యభర్తలు.. ఆ బైకుకు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ టక్కర్ ఇవ్వగా అదుపు తప్పి కిందపడిన ఘటనలో భార్య మృత్యువాత పడింది. సంఘటన గద్వాల జిల్లా అలంపూర్ లింగనవాయి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం... పెబ్బేరు మండలం చెలిమెళ్ళ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోపాల్ నాగమణి బొంతల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం లింగనవాయి గ్రామానికి బైక్పై వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ టక్కర్ ఇవ్వడంతో బైక్ మీద వెనకాల కూర్చున్న నాగమణి(48) కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి గోపాల్ ఫిర్యాదు మేరకు ఊట్కూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సమీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అకస్మాత్తుగా కళ్ళెదురుగా భార్య చనిపోవడంతో భర్త గోపాల్  కన్నీటి పర్యంతమయ్యారు.