calender_icon.png 23 September, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్లను పెంచకపోతే సర్కార్ ను కూల్చుతారు

23-09-2025 08:25:26 PM

- పెన్షన్ దారుల పట్ల కెసిఆర్ చేసిన నిర్లక్ష్యమే రేవంత్ చేస్తున్నారు

- రేవంత్, కెసిఆర్ పెత్తందారి వర్గాలకు చెందిన వారే పెన్షన్దారుల గోడు పట్టదు

- ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ దారుల పెన్షన్లను అమలు వర్షకపోతే సర్కార్ని పూలుస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మంగళవారం స్థానిక పిఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మత్స్యగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ చేయూత పెన్షన్ దారుల సన్నహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు. చేయుత పెన్షన్లు పెంచకుండా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు.

2023 ఎన్నికలలో నవంబర్ లో నాకు ఓటు వేయండి డిసెంబర్ లో పెరిగే పెన్షన్లు తీసుకోమని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నాక  దారుణంగా మోసం చేశాడని పేర్కొన్నారు. చేతగాని స్థితిలో ఉన్న పెన్షన్ దారులకు న్యాయం చేయాలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నారని అన్నారు.పెన్జన్లు పెంచడమా లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద నుండి దిగిపోవడమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల గురించి మాట్లాడకుండా కేసీఆర్ మౌనం వహించడం దుర్మార్గమని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ పెన్షన్ దారుల పక్షాన నిలవడంలో విఫలమైందని అన్నారు.

రేవంత్, కేసీఆర్ పేద వర్గాలకు చెందిన వాళ్లు కాదు కనుక  పేద వర్గాలకు చెందిన పెన్షన్ దారుల గోడు పట్టడం లేదన్నారు. పేద వర్గాలకు చెందిన బిడ్డగా పెన్షన్ దారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తామన్నారు. వికలాంగులకు 6000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు మిగతా పెన్షన్ దారులకు 4000 ఇవ్వాలని అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి నూతన పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అక్టోబర్ 6 నుండి నవంబర్ 6 వరకు నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో దీక్షలు చేపడుతామన్నారు.