calender_icon.png 23 September, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్టుప్పల్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా

23-09-2025 07:51:44 PM

- మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తా.. మీరు చేసింది ఏందో చూపించాలి

- గట్టుప్పల్ నుండి వావిళ్లపల్లికి మంజూరైన రోడ్డు రద్దు చేసింది వాస్తవం కాదా

- అభివృద్ధిని అడ్డుకొని కులగొట్టడమే కాంగ్రెస్ నైజం

- గట్టుప్పల్ అభివృద్ధిలో పనులలో నా పాత్ర లేకుంటే ముక్కు నేలకు రాస్తా

- చండూర్ మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం

మునుగోడు(గట్టుప్పల్),(విజయక్రాంతి): గట్టుపల్ మండలంలో మేము చేసిన అభివృద్ధి ఏమిటో లిఖితపూర్వకంగా చూపిస్తాను. మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించాలని గట్టుపల్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని చండూర్ మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండలంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతుల్లో నా పాత్ర లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ప్రతిపక్ష పార్టీకి సవాలు విసిరారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న ఒక్క పని కూడా చేయలేదని తెలవని సోయినయి సోయిలేని కాంగ్రెస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. మంజూరైన పనులను రద్దుచేసి మండల అభివృద్ధి విషయంలో వెనుకకు నెట్టారన్నారు. సబ్ సెంటర్కు మరో 20 లక్షల రూపాయలు, వాయులపల్లి నుండి గట్టుప్పల్ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల 50 లక్షలు రూపాయలు మంజూరు చేసి ప్రోసిడెంట్ తెప్పించమన్నారు. ఎన్నో ఆటంకాలని ఎదుర్కొని మంజూరు చేయించిన రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.

అంతంపేట నుండి గట్టుప్పల్ రోడ్డు నిర్మాణం, గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు బీటి రోడ్డు రెన్యూవల్ సిఆర్ఎఫ్ ద్వారా 30 కోట్ల మంజూరు. గట్టుప్పల్ నుండి లచ్చమ్మ గూడెం వరకు డబ్బులు రోడ్డు నిర్మాణం మంజూరు చేపిస్తే ఈఎంసి దగ్గర పెండింగ్లో ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న రజకుల కొరకు పది లక్షల నిధులతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపించామన్నారు. 3 వందల మగ్గాలు పంపిణీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు పెండింగ్లో ఉన్న110 మగ్గాలకు దిక్కు లేదని హేళన చేశారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా 12 లక్షల వ్యాయాయంతో రెండవ స్మశాన వాటికను తీసుకొచ్చిన ఘనత నాదేనన్నారు.

10 లక్షలతో సొసైటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందడుగు వేశానన్నారు. 12 లక్షలు రెండవ స్మశాన వాటిక నిర్మాణ శంకుస్థాపన బండను తొలగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర మీకేం విలువ ఉందో చెప్పాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాని మీరు ఉండడం వల్ల ఏమి ఉపయోగం అన్నారు. మన ఊరు మనబడి పథకం ద్వారా ఆరు లక్షల మంజూరు అయితే వచ్చే బిల్లులను ఆపి ఉన్న బడిని కూలగొట్టమంటుండు ఎమ్మెల్యే అన్నారు. కూలగొట్టే పని తప్ప అభివృద్ధి చేసే పని ఏమీ లేదన్నారు.