23-09-2025 09:24:05 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి,ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గార్ల చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బంజారా నాయకులు ప్రజలు,సిర్గాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు తుకారం పవర్ మాట్లాడుతూ... నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల బంజారా సోదరులు ఆరాధ్య దైవంగా భావించే సేవలాల్ మహారాజ్, భవాని మాత ఆలయం కోసం రూ.రెండు కోట్లను నియోజకవర్గ శాసనసభ్యులు సంజీవరెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, కృషితో బంజారా భవనం కోసం రూ.రెండు కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఇట్టి మూలంగా సిర్గాపూర్ మండలంలోని బంజారా సోదరుల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఎమ్మెల్యే ఎంపీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.