calender_icon.png 23 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి విద్యపై విద్యార్థులకు శిక్షణ

23-09-2025 08:15:33 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు వృత్తి విద్య కోర్సులైన అగ్రికల్చర్ లో భాగంగా మంగళవారం క్షేత్ర పర్యటన నిర్వహించారు.పాఠశాలలో విద్యార్థులు చదువుతున్న కోర్సుకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ శిక్షణలో పాల్గొంటున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రసన్న కుమారి తెలిపారు. విద్యార్థులు నర్సరీ మేనేజ్మెంట్లో భాగంగా, షెడ్ నెట్, ప్రోత్రేస్, నర్సరీ బెడ్లను విద్యార్థులు పరిశీలించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ప్రయోగ పూర్వక పరిజ్ఞానం అందించేందుకు విద్యార్థుల కోసం ఇంటర్నెట్ షిప్ నిర్వహిస్తున్నట్లు ట్రైనర్ టి శ్రీను తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నివేదిక సిద్ధం చేస్తారని ఆయన తెలిపారు.