23-09-2025 08:06:33 PM
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో 10 వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మైలారం గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిహెచ్ మధుసూదన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపును ప్రారంభించారు.
ప్రజలకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు సూచనలు తెలియజేశారు. ప్రజలు, భూగోళం కొరకు ఆయుర్వేదం అవసరం అనే నినాదంతో ఈ మెగా వైద్య ఆరోగ్య శిబిరంలో 425 మందికి మోకాల్ల నొప్పులు, పంటి నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులకు, షుగర్ సంబంధిత వ్యాధులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ప్రజలకు యోగ విశిష్టత గురించి తెలియజేశారు.