23-09-2025 07:57:41 PM
మహిళ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు చామకూరి రజిత
సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లాలోని గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు, బతుకమ్మ ఆటలను విజయవంతం చేయాలని మహిళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చామకూరి రజిత కోరారు. వెలిదండ గ్రామంలో మంగళవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈనెల 24 నుండి 30 వరకు జరగబోయే కబడ్డీ పోటీలకు, బతకమ్మ ఆటలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఈ ఆటల పోటీలను అందరి సహకారంతో విజయవంతం చేసేందుకు మహిళలందరూ కృషి చేయాలని ఆమె కోరారు.